
OLXలో అమ్మకానికి ఎమ్మార్వో ఆఫీస్.. కేవలం రూ.20 వేలకే!
AP: ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆకతాయి గిద్దలూరు ఎమ్మార్వో ఆఫీస్‌ను రూ.20 వేలకు OLXలో అమ్మకానికి పెట్టాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరలయింది. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది దృష్టికి రావడంతో వారు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆకతాయి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




