పడుకునే ముందు పాదాలకు సాక్సులు ధరించడం వల్ల మంచి నిద్ర వస్తుందని డాక్టర్ సేథి సూచిస్తున్నారు. ఆయన యూట్యూబ్ వీడియో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు, రాత్రిపూట పాదాలను శుభ్రం చేసుకుని, మాయిశ్చరైజర్ రాసుకుని, ఆపై సాక్సులు ధరించి పడుకుంటే ప్రయోజనం ఉంటుందని తెలిపారు. దీని వెనుక ఉన్న కారణాలను ఆయన వివరించారు.