కోలీవుడ్ నటుడు విజయ్
సేతుపతి, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్లమ్ డాగ్’. ఈ మూవీపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా చిత్రబృందం సీనియర్ నటి టబు ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆమె ‘గౌరి హెగ్డే’ పాత్రలో కనిపించనుంది. ఆగస్టు 10న ఉదయం 11 గంటలకు టబు పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. జేబీ మోషన్ పిక్చర్స్, ఛార్మి నిర్మిస్తున్న ఈ పాన్
ఇండియా సినిమా నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి.