
పీఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రా సౌకర్యం
ఈపీఎఫ్వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీఎఫ్ నగదును సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈపీఎఫ్వో 3.0 కార్యక్రమం కింద పీఎఫ్ విత్ డ్రాలు, బదిలీ ప్రక్రియలను కాగిత రహితంగా మార్చనున్నారు. ప్రస్తుతం ఈపీఎఫ్వో వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా క్లెయిమ్ చేయాల్సి వస్తుండగా, త్వరలో ఏటీఎం నుంచి ఎప్పుడైనా పీఎఫ్ డబ్బులు తీసుకునే సౌకర్యం కల్పించనుంది. ఇందుకోసం ఈపీఎఫ్వో డెబిట్ కార్డు తరహాలో ప్రత్యేక కార్డును జారీ చేయనుంది.




