ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ రూట్లో వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు!
Sep 29, 2026, 10:09 IST/

రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ రూట్లో వెళ్లే ఈ రైళ్లన్నీ రద్దు!

Sep 29, 2026, 10:09 IST
భారీ వర్షాల కారణంగా ఒడిశాలోని రాయగడ డివిజన్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఎంవీజీ, సీటీఎస్ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో కిరండూల్-విశాఖపట్నం మధ్య నడిచే 58502, 58501 ప్యాసింజర్ రైళ్లు, 18516, 18515 ఎక్స్‌ప్రెస్ రైళ్లు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీలలో రద్దయ్యాయి. భువనేశ్వర్-జగదల్‌పూర్ మధ్య నడిచే 18447, 18448 ఎక్స్‌ప్రెస్ రైళ్లు సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 తేదీలలో కోరాపుట్ వరకు మాత్రమే నడుస్తాయి. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని, రైళ్ల ప్రస్తుత స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలని సౌత్ కోస్ట్ రైల్వే సూచించింది.