TG: మహిళలకు శుభవార్త చెప్పనుంది. మహిళల ఉచిత ప్రయాణంలో ఇబ్బందులు తొలగించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఢిల్లీలోని 'సహేలీ' కార్డుల తరహాలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ స్మార్ట్ కార్డులను 2026 ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో 2025లోనే ప్రవేశపెట్టాలని భావించినా, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయింది. ఇప్పుడు కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నారు.