భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి వన్డేల్లో నం.1 బ్యాటర్‌గా నిలిచింది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె ఇంగ్లాండ్ కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్‌ను దాటింది. నం.1 బ్యాటర్‌గా నిలవడం మంధానకు ఇది నాలుగోసారి. హర్మన్‌ప్రీత్ కౌర్ (12), జెమిమా రోడ్రిగ్స్ (15) టాప్-20లో నిలిచారు. బౌలర్లలో దీప్తి శర్మ మాత్రమే టాప్-10లో ఉండగా మూడు స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయింది.