ఏషియన్ గేమ్స్-2026 ఫైనల్లో శ్రీలంకపై టీమ్
ఇండియా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (48), స్మృతి మంధాన (79) ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. తొలి 10 ఓవర్లలోనే 99 పరుగులు చేశారు. స్మృతి మంధాన 7 సిక్సర్లు, 5 ఫోర్లతో చెలరేగారు. రిచా ఘోష్ (49*) చివరి వరకు వేగంగా ఆడి స్కోరును పెంచారు.