సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌పై భారత మహిళా క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన స్నేహితుడు విజ్ఞాన్ ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదుతో మహారాష్ట్రలోని సంగ్లీ పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. ఒక సినిమా ప్రాజెక్టు కోసం పలాశ్ తన వద్ద రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారని, కులాన్ని ఉద్దేశించి దూషించారని విజ్ఞాన్ ఆరోపించారు. గత ఏడాది నవంబరు 22న జరిగిన వాగ్వాదం నేపథ్యంలో ఈ ఫిర్యాదు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్‌ల వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే.