జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న 28 ఏళ్ల యువకుడిని గత నెలలో ఒక పాము కాటేసింది. చికిత్సతో ప్రాణాపాయం తప్పినా, ఆ తర్వాత మరోసారి, ఆపై మళ్లీ మళ్లీ కాటు వేసింది. ఈ విధంగా నెల రోజుల్లోనే ఏడు సార్లు పాము కాటేసినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.