
ఎస్బీఐ డెబిట్ కార్డు వాడకపోతే ఛార్జీలు తప్పవు!
SBI డెబిట్ కార్డులను తరచుగా ఉపయోగించని ఖాతాదారులకు వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు వర్తించే అవకాశం ఉంది. SBI నిబంధనల ప్రకారం, డెబిట్ కార్డు తీసుకున్న రెండో సంవత్సరం ప్రారంభం నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి. సాధారణ కార్డులకు ఏటా రూ. 200-250, ప్రీమియం కార్డులకు రూ. 300-800 వరకు జీఎస్టీతో సహా ఛార్జీలు ఉంటాయి. కార్డు రీప్లేస్మెంట్, విదేశీ లావాదేవీలు, ఏటీఎంలలో బ్యాలెన్స్ చెక్ చేసినా అదనపు ఛార్జీలు వర్తిస్తాయి. కార్డును రెగ్యులర్గా వాడకపోయినా ఖాతా నుంచి ఈ ఛార్జీలు ఆటోమేటిక్గా కట్ అయ్యే అవకాశం ఉంది.




