గోడలో దాక్కున్న పాములు.. భయపడిన స్థానికులు (వీడియో)

0చూసినవారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్‌పూర్ జిల్లా, ముజఫరాబాద్ మండలంలోని బధేరి ఘోగు గ్రామంలో మంగళవారం ఉదయం ఒక ఇంట్లో గోడలు, నేల నుంచి వింత శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పరిశీలించగా, గోడ లోపలి నుంచి ఏడు పాములు బయటకు వచ్చాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ గంటకు పైగా శ్రమించి పాములను బంధించి, సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. వాతావరణ మార్పుల వల్ల పాములు బయటకు వచ్చి ఉంటాయని స్నేక్ క్యాచర్ తెలిపారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్