
లాయర్ వృత్తిని వదిలి.. రూ.51 వేలు సంపాదిస్తున్న లిజ్!
30 ఏళ్ల లిజ్ ఈస్ట్ అనే క్రిమినల్ డిఫెన్స్ లాయర్ తన భర్త డాగ్ వాకింగ్ వ్యాపారాన్ని చూసి ప్రేరణ పొందింది. లాయర్ ఉద్యోగాన్ని వదిలి కుక్కల వాకింగ్ వ్యాపారం ప్రారంభించింది. మొదట్లో పబ్‌లో పనిచేస్తూ, కస్టమర్లను సంపాదించుకున్న లిజ్, ఇప్పుడు రోజుకు 20-30 కుక్కలను చూసుకుంటూ, ఒక్కో కుక్కకు గంటకు రూ.1,800 చొప్పున వసూలు చేస్తూ, రోజుకు రూ.38 వేల నుంచి రూ.51 వేల వరకు సంపాదిస్తోంది. లాయర్‌గా పనిచేసినప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నానని, తక్కువ సమయం పనిచేస్తున్నానని లిజ్ చెబుతోంది.




