తెలుగు రాష్ట్రాలపై మంచు దుప్పటి

10628చూసినవారు
తెలుగు రాష్ట్రాలపై మంచు దుప్పటి
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ శివారులోని హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌- విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. విజయవాడ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. రాకపోకలు  ఆలస్యమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్