ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని ఆంథోని అల్బనీస్ ప్రకటించారు. ఈ నిర్ణయం పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిషేధం అమలులోకి వస్తే, ఆస్ట్రేలియాలో పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించలేరు.