ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


రష్యాపై 30 వేలకు పైగా ఆంక్షలు.. పుతిన్ తీవ్ర విమర్శలు
Sep 12, 2026, 02:09 IST/

రష్యాపై 30 వేలకు పైగా ఆంక్షలు.. పుతిన్ తీవ్ర విమర్శలు

Sep 12, 2026, 02:09 IST
న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాశ్చాత్య దేశాల ఆంక్షలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రపంచ దేశాలపై విధించిన ఆంక్షల కంటే రెట్టింపు స్థాయిలో రష్యాపై 30 వేలకు పైగా ఆంక్షలు విధించారని, ఇది ప్రభుత్వాల స్థాయిలోనే జరుగుతోందని అమెరికాను ఉద్దేశించి విమర్శించారు. గ్యాస్ పైప్‌లైన్ల ధ్వంసం, రవాణా మార్గాల మూసివేత వంటి చర్యలకు పాల్పడుతున్నారని, అయితే ఈ ఆంక్షల ప్రభావాన్ని రష్యా విజయవంతంగా తిప్పికొట్టిందని, ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ సగటు కంటే మెరుగ్గా నమోదైందని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు.