
షార్ట్ సర్క్యూట్.. కాలిబూడిదైన 30 ఎకరాల మొక్కజొన్న పంట (వీడియో)
జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి (మండలం) జులేకల్ గ్రామంలో వ్యవసాయ పొలంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈదురు గాలుల కారణంగా మంటలు ఒక పొలం నుంచి మరో పొలానికి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 ఎకరాల మొక్కజొన్న పంట కాలి బూడిదైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.




