సర్పంచ్ బరిలో జవాన్ భార్య

28చూసినవారు
సర్పంచ్ బరిలో జవాన్ భార్య
TG: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో సైనికుడి భార్య కాసురి మమత శనివారం సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామాల్లోని గ్రూపు రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తాను బరిలోకి దిగానని ఆమె తెలిపారు. నాయకులు తమ స్వప్రయోజనాల కోసం సమస్యలను క్లిష్టతరం చేస్తున్నారని, న్యాయం జరగడం లేదని ఆమె ఆరోపించారు. జనసేన కార్యకర్తల సహకారంతో ధైర్యం వచ్చిందని, దేశ సేవలో ఉన్న తన భర్త కోరిక మేరకు గ్రామ అభివృద్ధి కోసం పోటీ చేస్తున్నానని తెలిపారు.