నిర్మాత సి. కళ్యాణ్ చేసిన ఎన్ కౌంటర్ వ్యాఖ్యలను ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు ఖండించారు. 'ఆయనను ఎన్కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎవడు తీయమన్నాడు. నా కొడుకు తరఫున వాదించే న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేస్తా' అని ఆయన అన్నారు. సినిమా టికెట్ ధరలు పెరిగాయని, ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తేనే విజయం సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.