AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయ తొక్కిసలాట పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తల్లితో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ బాలుడు తొక్కిసలాటలో ప్రాణాలు విడిచాడు. విగతజీవిగా నేలపై పడి ఉన్న కొడుకును చూసి ఆ తల్లి గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ‘నానా లేవరా’ అంటూ కొడుకుకి ముద్దు పెట్టింది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.