TG: ఆదిలాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. గత నెలలో తల్లి అనారోగ్యంతో చనిపోవడంతో మనస్తాపానికి గురైన కుమారుడు ఆమె చీరతోనే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన బంధువులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబంలో రెండు మరణాలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిపై ఉన్న ప్రేమతోనే ఇలా చేశాడని స్థానికులు చెబుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.