కొడుకు వేధింపులు.. కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి

37చూసినవారు
కొడుకు వేధింపులు.. కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలిపిన తండ్రి
డబ్బుల కోసం వేధిస్తున్న కొడుకును చంపడానికి తండ్రి కూల్‌డ్రింక్‌లో పురుగు మందు కలిపాడు. నందిగామ(M) చందాపురం గ్రామానికి చెందిన శంకరశెట్టి శ్రీనివాసరావు పెద్దకుమారుడు వెంకటేష్(26) తనకు డబ్బులు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని తండ్రిని బెదిరించేవాడు. కుమారుడి ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీనివాసరావు కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపాడు. గత నెల 23న ఆ డ్రింక్ తాగిన వెంకటేష్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అలాగే ఈ డ్రింక్ తాగిన వెంకటేష్ భార్య, అత్త చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్