బండరాయితో కొట్టి కన్నతండ్రిని చంపిన కొడుకు

29521చూసినవారు
బండరాయితో కొట్టి కన్నతండ్రిని చంపిన కొడుకు
TG: మద్యం మత్తులో కన్నతండ్రిని కొడుకు హత్య చేసిన ఘటన మేడ్చల్‌ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్.. తన కుమారుడు షేక్ సాతక్‌‌తోపాటు అతడి స్నేహితుడితో కలిసి మంగళవారం రాత్రి మద్యం సేవించారు. ఈ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంలో షేక్ సాతక్‌‌ బండరాయితో తండ్రిపై దాడి చేశాడు. దీంతో నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్