కుమార్తెకు చేతబడి చేశాడని అనుమానం.. తండ్రిని చంపిన కొడుకు

35818చూసినవారు
కుమార్తెకు చేతబడి చేశాడని అనుమానం.. తండ్రిని చంపిన కొడుకు
TG: తన కూతురును చేతబడి చేసి చంపాడన్న అనుమానంతో తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో చోటు చేసుకుంది. వాసవి నగర్​కు చెందిన బాలయ్య(70) చిన్న కొడుకు బీరయ్య కుమార్తె (16) రెండు నెలల క్రితం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె మరణానికి తండ్రి చేతబడే కారణమని అనుమానించాడు. ఈ నెల 3న బాలయ్యను కొడుకు కర్రలతో తలపై మోది హత్య చేశాడు. కొరటికల్ వాగులో మొండెం, చింతపల్లి వాగులో అతడి తల లభ్యమైంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్