పెళ్లి కోసం 21 ఏళ్లు వచ్చే వరకు ఆగాలన్నందుకు తండ్రిని చంపిన కొడుకు

7చూసినవారు
పెళ్లి కోసం 21 ఏళ్లు వచ్చే వరకు ఆగాలన్నందుకు తండ్రిని చంపిన కొడుకు
చండీగఢ్‌లో పెళ్లి విషయంపై తలెత్తిన వివాదంతో నితిన్‌ సింగ్‌ అనే కానిస్టేబుల్‌ను ఆయన 18 ఏళ్ల కుమారుడు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ప్రియురాలితో వెంటనే పెళ్లి చేయాలని కుమారుడు పట్టుబడగా, 21 ఏళ్లు వచ్చే వరకు ఆగాలని తల్లిదండ్రులు చెప్పడంతో గొడవ జరిగింది. తండ్రిని తుపాకీతో కాల్చి హత్య చేసి, తల్లిపైనా దాడికి ప్రయత్నించాడు. హత్యను బయటి వ్యక్తులు చేసినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమైన కేసు కూడా అతడిపై ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్