AP: విజయనగరం జిల్లా తెర్లాం మండలం ఎం.ఆర్. అగ్రహారంలో దారుణం జరిగింది. బుధవారం రాత్రి తండ్రి అప్పలస్వామి (70), కుమారుడు శంకరరావు మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో కుమారుడు తండ్రి తలపై రాయితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అప్పలస్వామి మృతిచెందారు. ఈ ఘటనపై మృతుడి మనవరాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.