ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గరియాబంద్ జిల్లాలోని జోగిదీప గ్రామానికి చెందిన కమలేశ్ ఇంటి వస్తూ చేపలు తీసుకొచ్చాడు. కూర వండాలంటూ తల్లికి చెప్పడంతో అప్పటికే చీకటి పడిందని ఆమె నిరాకరించింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉదయం లేచి చూసే సరికి ఆ చేపలకు చీమలు పట్టాయి. కోపోద్రిక్తుడైన కొడుకు గొడ్డలితో తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.