AP: మద్యం తాగి వచ్చిన తనను చూసి నవ్వాడని తండ్రిని కొడుకు గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో చోటుచేసుకుంది. మాణిక్యరాయునిపల్లెకు చెందిన చెంగారెడ్డికి జోకేశ్ రెడ్డి, హేమచంద్రారెడ్డి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు జోకేశ్ రెడ్డి మద్యం తాగి భార్యను వేధించేవాడు. బుధవారం రాత్రి మద్యం తాగి రావడంతో ఆయన భార్య.. మామ చెెంగారెడ్డికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో ఇంటికి వెళ్లిన జోకేశ్ రెడ్డిని చూసి తండ్రి నవ్వడంతో ఆగ్రహానికి గురయ్యాడు. కత్తితో గొంతు కోసి పారిపోయాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.