
73 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్.. ఫిట్నెస్ రహస్యం ఇదే!
బిజీ లైఫ్, అనారోగ్యకరమైన జీవనశైలి మధ్య ఫిట్నెస్ను కాపాడుకోవడం కష్టంగా మారింది. అయితే, 73 ఏళ్ల మార్క్ అనే వ్యక్తి తన సిక్స్ ప్యాక్ బాడీతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ (TRT) కాదని, తన దినచర్యే రహస్యమని ఆయన తెలిపారు. ప్రతిరోజూ 100 పుష్-అప్లు, 100 పుల్-అప్లు చేస్తానని, తక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటానని ఆయన వివరించారు.




