లడఖ్ లో సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్

22834చూసినవారు
లడఖ్ లో సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్
పర్యావరణ కార్యకర్త, లడఖ్ రాష్ట్ర హోదాకు డిమాండ్ చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర హోదా కోరుతూ రెండు రోజుల క్రితం లడఖ్ వ్యాప్తంగా జరిగిన భారీ నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఆందోళనకారులు అధికారులు, బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి, బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టి, సీఆర్పీఎఫ్ వాహనాన్ని తగలబెట్టారు. ఈ అల్లర్లను ప్రేరేపించిన కారణంగా సోనమ్ వాంగ్‌చుక్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్