TG: కొడుకులు కన్నతల్లికి తిండి పెట్టకుండా వదిలేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట గ్రామంలో జరిగింది. దీనస్థితిలో ఉన్న కన్నతల్లికి తిండి పెట్టకుండా నలుగురు కొడుకులు రైతు వేదికలో వదిలేశారు. తిండిలేక, చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చొరవ చూపి వృద్ధురాలిని కాపాడాలని కోరుతున్నారు.