
రేపే భారత్-వెస్టిండీస్ రెండో వన్డే
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా రేపు గౌహతిలో టీమిండియా రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. గౌహతిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మంచి రికార్డు ఉంది. 2018లో వెస్టిండీస్‌పై వీరిద్దరూ సెంచరీలు చేయగా, 2023లో శ్రీలంకపై కోహ్లీ సెంచరీ, రోహిత్ అర్ధశతకం సాధించారు. వీరిద్దరూ రాణిస్తే విండీస్‌కు కష్టాలు తప్పవని అంచనా.




