
సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకులు మృతి
TG: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. జప్తి లింగారెడ్డి పల్లి ఎక్స్ రోడ్ సమీపంలో ఆల్వాల వడ్డెర కాలనీ వద్ద లారీ బైక్ను ఢీ కొట్టింది. మృతులు మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన చల్మెడ కుమార చారి (39), ఆయన కుమారుడు సుశాంత్ (8)గా గుర్తించారు. ఈ ఘటనలో మరొకరు గాయపడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.




