దక్షిణ మధ్య రైల్వే నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూళ్లలో మార్పులు చేసింది. సేవా సామర్థ్యం, నిర్వహణ, సమయపాలన మెరుగుపరచడమే లక్ష్యంగా మార్పులను చేసినట్లు వివరించింది. కాచిగూడ–యశ్వంత్‌పూర్ వందే భారత్ ఇకపై బుధవారం కాకుండా, ప్రతి శుక్రవారం రద్దు చేయనున్నారు. సికింద్రాబాద్–విశాఖపట్నం వందే భారత్ గురువారం కాకుండా, సోమవారం రద్దు చేయనున్నారు. ఈ మార్పులు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. రైళ్ల టైమింగ్స్, హాల్ట్‌లు, ఫ్రీక్వెన్సీలో మార్పులు లేవు.