దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెలంగాణలోని చర్లపల్లి నుండి తమిళనాడులోని నాగర్‌కోయిల్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07535 (చర్లపల్లి – నాగర్‌కోయిల్) సెప్టెంబర్ 25, 2026 నుండి అక్టోబర్ 23 వరకు ప్రతి శుక్రవారం నడుస్తుంది. రైలు నంబర్ 07536 (నాగర్‌కోయిల్ – చర్లపల్లి) సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 25 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.