వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ దిశను సరిగా నిర్వహిస్తే వృత్తిలో స్థిరత్వం, సంపద ప్రవాహం మెరుగుపడుతుందని నమ్మకం. ఆర్థికంగా నిలకడ లేకపోయినా, అభివృద్ధి మందగించినట్లు అనిపించినా, దక్షిణ దిశలో ఫీనిక్స్ పక్షి చిత్రం, జేడ్ మొక్క, పరుగెత్తే ఏడు గుర్రాల చిత్రం, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, చీపురు సరైన స్థానంలో ఉంచడం వంటి మార్పులను వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. దక్షిణ దిశను సరైన విధంగా ఉపయోగిస్తే స్థిరత్వం, సంపద, గౌరవం లభిస్తాయంటున్నారు.