నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి చల్లని కబురునందించాయి. కేరళలోని 3 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రుతుపవనాల ప్రభావం తమిళనాడులో కూడా కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రుతుపవనాలు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.