ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకలోకి విస్తరించాయి. ఇప్పటికే దక్షిణకోస్తా, తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నాయి. ఈ నెల 15 నాటికి ఏపీ, తెలంగాణ అంతటా విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.