రేపు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

28చూసినవారు
రేపు కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
జూన్ 4న నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఇప్పటికే అక్కడ తొలకరి వర్షాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రుతుపవనాలు కేరళ, తమిళనాడు మీదుగా తెలుగు రాష్ట్రాల వైపునకు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలంగాణలో వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్