మరికొద్దిగంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

26చూసినవారు
మరికొద్దిగంటల్లో కేరళను తాకనున్న  నైరుతి రుతుపవనాలు
మరికొద్దిగంటల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఆలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మరో మూడుగంటల పాటు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. రుతుపవనాలు తమిళనాడు వైపు కదిలే సూచనలతో, ఆ రాష్ట్రంలోని 15 జిల్లాలకు కూడా భారీ వర్షసూచన చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్