స్పేస్‌ఎక్స్‌ కీలక ప్రయోగం.. తొలిసారి భూకక్ష్యలోకి స్టార్‌షిప్‌

0చూసినవారు
ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ, తన భారీ రాకెట్ స్టార్‌షిప్‌ను తొలిసారి భూకక్ష్య దిశగా ప్రయోగించింది. సోమవారం సాయంత్రం అమెరికాలోని టెక్సాస్‌ తీరం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ ప్రయోగంలో, స్టార్‌లింక్‌కు సంబంధించిన 26 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతోపాటు భూమి చుట్టూ రాకెట్‌ ఆరు చక్కర్లు కొట్టేలా ప్రణాళిక రచించారు. దాదాపు 10 గంటలపాటు కొనసాగే ఈ ప్రయోగం, చంద్రుడిపై మానవసహిత యాత్రకు నాసా సిద్ధమవుతున్న తరుణంలో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్