
ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
ఛత్తీస్గఢ్లో మరో 12 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, రూ.3 కోట్ల రివార్డు ఉన్న రాంధెర్ కూడా ఉన్నారు. మిళింద్ తెల్టుంబే మరణానంతరం రాంధెర్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ (MMC) జోన్ బాధ్యతలు చూస్తున్నారు. రాంధెర్ లొంగుబాటుతో MMC జోన్ నక్సల్స్ రహిత ప్రాంతంగా మారినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించగా, మరికొందరు లొంగిపోతున్నారు.




