
రాప్తాడు బాలిక మాట్లాడుతోంది.. అప్డేట్ ఇచ్చిన మంత్రి లోకేష్
AP: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో దారుణ దాడికి గురైన విద్యార్థిని, బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో కోలుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. చిన్నారి స్వల్పంగా మాట్లాడుతోందని, ద్రవ పదార్థాలను తీసుకుంటోందని తెలిపారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ బృందాలు ఆమెకు వైద్య చికిత్స అందించనున్నాయి. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.




