కొత్త గ్రహాలను కనుగొన్న స్పానిష్ శాస్త్రవేత్తలు

96చూసినవారు
కొత్త గ్రహాలను కనుగొన్న స్పానిష్ శాస్త్రవేత్తలు
స్పానిష్ శాస్త్రవేత్తల బృందం సోలార్ సిస్టమ్ బయట రెండు కొత్త గ్రహాలను గుర్తించారు. TOI-1752 అనే నక్షత్రం చుట్టూ ఈ గ్రహాలు పరిభ్రమిస్తున్న ప్రకటించారు. వీటికి TOI-1752b, TOI-1752c అని పేర్లు పెట్టారు. 1752b లావాతో నిండి ఉంటుందని, 1752cపై భూమి తరహాలో నీరు ఉండే అవకాశముందని పేర్కొన్నారు. ఇవి రెండూ పరిమాణంలో భూమి కంటే 4-5రెట్లు పెద్దగా ఉంటాయని వెల్లడించారు. నక్షత్ర కాంతిలో వచ్చే మార్పుల ఆధారంగా ట్రాన్సిట్ పద్ధతిలో వీటిని గుర్తించారు.

సంబంధిత పోస్ట్