ఏసీ గదుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం కాదని, దమ్ముంటే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు వచ్చి మాట్లాడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. తాను చౌటుప్పల్‌లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నానని, పంట కొనడం లేదని రైతులు స్వయంగా చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.