AP: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి, వారిలో కొందరిని విచారించారు. కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు మరో 2 నెలల గడువు కావాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును కోరారు.