TG: విద్యార్థుల ఆధార్ రిజిస్ట్రేషన్, అప్‌డేట్ కోసం స్కూళ్లలో స్పెషల్ ఆధార్ మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ సెంటర్లు ఎప్పుడు, ఏ స్కూల్‌లో ఉంటాయో తెలుసుకునేందుకు డీఈవో, ఎంఈవోలను సంప్రదించాలని సూచించింది. 5-15, 15-17 ఏళ్ల వయసున్న అన్ని స్కూల్ విద్యార్థుల ఫస్ట్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితమని, రెండోసారి అయితే రూ.125, వివరాల మార్పునకు రూ.75 చెల్లించాలని అధికారులు తెలిపారు.