రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. వాతావరణ సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లో అందించే 'మౌసమ్ వాణి' అనే సరికొత్త అప్లికేషన్‌ను Indian Institute of Tropical Meteorology (IITM) అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన వాతావరణ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ప్రారంభంలో హిందీ, ఇంగ్లీష్‌లలో అందుబాటులోకి వచ్చి, తర్వాత తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషలకు విస్తరించనుంది. అయితే ఈ సేవను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు.