అనావృష్టి, అతివృష్టి, మొంథా తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతున్న నేపథ్యంలో, రైతులు నష్టాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వ యాప్‌లు ఉపయోగపడతాయి. ఈ యాప్‌లు వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల గురించి ముందుగానే సమాచారం అందించి, వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తాయి. మేఘ్‌దూత్, రెయిన్ అలారం, కిసాన్ సువిధ, దామినీ యాప్‌లను ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.