
బలవంతంగా మద్యం తాగించి కోడలిపై మామ అత్యాచారం
యూపీలో దారుణ ఘటన నెలకొంది. లక్నోలో 58 ఏళ్ల రైల్వే ఉద్యోగిని తన కోడలిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే ఉద్యోగిపై వరకట్న వేధింపులు, శారీరక దాడి, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలు నవంబర్ 2023లో అతని కుమారుడిని వివాహం చేసుకుంది. పెళ్లయిన మొదటి రోజు నుంచే వేధింపులు మొదలయ్యాయని, ఆ తర్వాత మామగారు బలవంతంగా మద్యం తాగించి పలుమార్లు తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించి, శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.




